హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డిని 7th ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025 తెలంగాణ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ పోటీలలో పతకాలు సాధించినవారిని సీఎం అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీలలో 133 పతకాల్లో 28 ( 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) పతకాలను తెలంగాణ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళీ బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.