యూరియా యాప్ రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం

  ఏర్గట్ల, బతుకమ్మ :   రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్గట్ల మండల నాయకులు శుక్రవారం తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు...