బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నగరంలోని ఫూలాంగ్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ  ప్రభుత్వం హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా ఇప్పటివరకు వాటిని తీర్చలేదని విమర్శించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు....