Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 7:37 pm Posted by : ramakrishna

తెగిన రోడ్డుకు మరమ్మతులు

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండల కేంద్రంలోని రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే రోడ్డు  తిర్మన్ పల్లి గ్రామ  శివారు దాటిన తర్వాత  భారీ వర్షాలతో ఒక్కసారిగా వచ్చిన వరదల కారణంగా రోడ్డు  తెగిపోయి రెండు భారీ వృక్షాలు రోడ్డుపై పడిపోగా గురువారం ఉదయం  రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వృక్షాలను ప్రజల సహాయంతో,జెసిబి సహాయంతో తొలగించి రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో  స్థానిక ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇందల్వాయి పోలీస్  సిబ్బంది, గ్రామస్తులు సహాయంతో టెంపరరీగా వాహనాలు వెళ్ళుటకు  రోడ్డుకు మరమ్మత్తులు చేయడం జరిగిందని  ఎస్సై సందీప్ తెలిపారు. దీంతో ప్రయాణికులు పోలీసు సిబ్బందికి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.