Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 3:40 pm Posted by : ramakrishna

తాగునీటి పైప్ లైన్ కు మరమ్మతులు

స్పందించిన అధికారులు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో తాగు నీటి సమస్యను పరిష్కరించండి సారూ?.. పట్టించుకోని అధికారులు అనే శీర్షిక పై ఆదివారం బతుకమ్మ లో ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం తాగు నీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తాగునీటి కుళాయిలకు మోటార్ లు పెట్టవద్దన్నారు. మోటార్ లు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈ మున్నీనాయక్, ఏఈ అజయ్, సూపర్ వైజర్ సునీల్, అఖిల్, నర్సింలు తదితరులున్నారు.