- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: గత నెల 28 భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాములు తెగిపోయాయని, వాటన్నిటినీ పరిశీలించి త్వరగా మరమ్మత్తులు చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించిన ఇరిగేషన్,ఆర్ అండ్ బి, ఆర్ టి సి అధికారులతో సోమవారం నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ చెరువు కట్టలు తెగిన దగ్గర తొందరగా మరమ్మతులు చేసి, రెండో పంటకు నీళ్లు ఉండేటట్లు, రెండో పంటకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని అన్నారు. అలాగే భారీ వర్షాల వల్ల వంతెనలు, కల్వర్టులు, ప్రధాన రహదారులు, గ్రామాల్లోని రహదారులు, రోడ్లు ధ్వంసం అయినందున ప్రజలకు ఇబ్బంది కాకుండా త్వరగా పనులు చేపట్టి తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని కులస్ పూర్, హుస్సేన్ నగర్, కొలిప్యాక్, రాంపూర్, రేకులపల్లి గ్రామాలకు బస్సును నడపాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అధికారులు ఈఈ నరేందర్, డి ఈ ప్రేమ్ కుమార్, ఆర్టీసీ అధికారులు ఆర్ ఎం,ఏ ఆర్ ఎం, ఆర్ అండ్ బి అధికారులు ఈ ఈ, డి ఈ, తదితరులు పాల్గొన్నారు.
