Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 7:31 pm Posted by : ramakrishna

వెల్లుట్ల పేట లో ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

వెల్లుట్ల పేట గ్రామంలో వార్షికోత్సవం సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో మంగళవారం పుణ్యవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులందరిని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్ద గౌడు, సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఆయన అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం గ్రామ మహిళలు సంప్రదాయ బోనాలను అలంకరించి ఘనంగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు.

 

Renuka Yellamma's wedding ceremony held in Vellutlapet

 

డప్పుల శబ్దాలు, మంగళ వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు భక్తి వాతావరణంలో సాగింది. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని పుణ్యవచనం, కళ్యాణోత్సవం, బోనాల కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఆలయం పరిసరాలు భక్తుల రద్దీతో కళకళలాడుతూ పండుగ అత్యంత వైభవంగా జరిగింది.