Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:02 pm Posted by : ramakrishna

ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు

 

రుద్రూర్,  బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Renuka Yellamma's wedding celebrations are grand

 

అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, గౌడ సంఘం అధ్యక్షులు గుండూరి విఠల్ గౌడ్, సుధాకర్ గౌడ్, సతీష్ గౌడ్, నారా గౌడ్, శ్రీను గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Renuka Yellamma's wedding celebrations are grand