Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 6:57 pm Posted by : ramakrishna

అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ మహోత్సవ వేడుకలు

 

. . . బోనమెత్తిన రుద్రూర్ ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ మహోత్సవ వేడుకలను ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో, భాజా భజంత్రీలతో మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న పాల్గొని బోనమెత్తారు. గౌడ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

Renuka Yellamma Mahotsava celebrations in grandeur