Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 7:57 pm Posted by : ramakrishna

5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేణుక పవన్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల కందర్ పల్లి గ్రామం 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కుర్కుటే రేణుక పవన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజల ఆశీర్వాదంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపుకు కారణమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వార్డులో అభివృద్ధి శూన్యమైందని, ముఖ్యంగా రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని విమర్శించారు. తాను గెలుపొందితే వార్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను కచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన తనకు ప్రజాసేవ చేయడమే లక్ష్యమని, అవకాశం ఇస్తే వార్డు సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సాహితీ రాము అన్నారు.