సెల్ఫ్​ డ్రైవింగ్​ కోసమని కారు అద్దె

కామారెడ్డి, బతుకమ్మ : సెల్ఫ్​ డ్రైవింగ్​ కోసమని కారును అద్దె తీసుకొని  ఫేక్ ఐడీ కార్డులు, ఆర్సీలతో అమ్ముకుంటున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు  చేశారు. జిల్లా పోలీస్​ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్​ చంద్ర బుధవారం వివరాలను వెల్లడించారు. ఫేస్​బుక్ అప్లికేషన్ ద్వారా వ్యక్తులు కారుకొన్న తర్వాత ‘‘ఆ కారు మాది.. మీరెలా కొనుక్కుంటారు’’ అంటూ కొందరు వ్యక్తులు కారును ఎత్తుకెళ్లిన కేసు మాచారెడ్డి పోలీస్​ స్టేషన్​లో జూలై 1న నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులకు కీలక విషయాలు...