నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరించండి
కేంద్ర హోం మంత్రికి రూరల్ ఎమ్మెల్యే వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ను పునరుద్దరణ చేయాలనీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాత్రమే సహకార చక్కెర కర్మాగారం అని అన్నారు. ఈ కర్మాగారం 1958 లో స్థాపించబడిందని తెలిపారు. 1962 నుండి పనిచేయడం ప్రారంభించి, 126 గ్రామాల...