Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 6:07 pm Posted by : ramakrishna

దేశ సుస్థిరాభివృద్ధికి పునరుత్పాదకత ఇంధన వనరులను కాపాడాలి

 సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మావురపు అధ్యక్షతన 2024 జాతీయ సైన్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ – నాగపూర్ (డి అర్ డి ఓ )సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ సుస్థిరాభివృద్ధి -పునరుత్పాదక వనరుల పాత్ర అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు.
ప్రధాన పునరుత్పాదకత వనరులైన సౌరశక్తి, పవనశక్తి, జలశక్తులను కాపాడుకోవాలని పేర్కొన్నారు. లేదంటే ప్రకృతికి హానిజేసే మానవ ఉద్గారాలైన క్లోరోప్లోరో కార్బన్సు వలన ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల అతినీలలోహిత కాంతి కిరణాలు భూమికి చేరి మానవ శరీరంపై క్యాన్సర్ కు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. సెల్యూలోజ్, సహజ రసాయనాలు మరియు హరిత రసాయనాలను పునరుత్పాదకత శక్తి వనరులను వినియోగించుకొని మానవ సుస్థిరాభి అభివృద్ధి పాల్పడాలని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ మానవ మనుగడకు శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగే నూతన వినూతన ప్రయోగాలే దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ అరతి, టీజీ కాస్ట్ నోడల్ ఆఫీసర్ ఆచార్య వాసం చంద్రశేఖర్, బయోటెక్నాలజీ హెడ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రసన్న శీలా, డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ డాక్టర్ ఏ పున్నయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శరత్, నాగేంద్రబాబు, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, అపర్ణ,నరసయ్య,రమ్య పరిశోధక విద్యార్థులు మరియు పీజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.