రాగి జావ నిర్వహణ కార్మికులకు పారితోషికం ఇవ్వాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పిఎం పోషణ మినరల్స్ (రాగి జావ) నిర్వహణ కొరకు కార్మికులకు పారితోషకం ఇవ్వాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జి జి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లాఅడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పీఎం...