Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 12:00 pm Posted by : ramakrishna

గ్యారెంటీలంటూ ఉన్నవి ఎత్తేసిండు

. బతుకమ్మ చీరల పంపిణీ ఎక్కడ?

. తెలంగాణ సంస్కృతికి చిహ్నం మన బతుకమ్మ

నిజామాబాద్, బతుకమ్మ: గ్యారెంటీలు అంటూ ఉన్న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ఎత్తేశారని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడ బిడ్డలకు చీరలు ఎందుకు పంపిణీ చేయడం లేదని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు,  ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేశారని, ముస్లిం, క్రిస్టియన్ లకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ లు అందజేశారన్నారు. కానీ  రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన పండుగలను కనుమరుగు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు ఆర్మూర్ మున్సిపాలిటీ తో కలిపి గత పది సంవత్సరాలు గా సుమారు 13 లక్షల చీరలు తమ హయాంలో పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ  పండగలపై వివక్ష చూపొద్దని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారన్నారు.