Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:00 pm Posted by : ramakrishna

బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించండి

 

. . . ప్రధాని మోడీకి టీఆర్ఎస్ చీఫ్ కవిత లేఖ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ రాసారు. కేంద్ర మంత్రి తనయుడిపై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగడానికి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని టీఆర్ఎస్ చీఫ్ కోరారు. బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బండి భగీరథ్ వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల కవిత మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి వివరాలను బిఆర్ఎస్ బహిర్గతం చేయడం దారుణమని వ్యాఖ్యలు చేశారు. తాజాగా బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.

 

Remove Bandi Sanjay from the Union Cabinet.

 

Remove Bandi Sanjay from the Union Cabinet.