Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 7:51 pm Posted by : ramakrishna

ముళ్ళ కంపలు, పొదలు తొలగింపు

బతుకమ్మ, మద్నూర్/డోంగ్లి: రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ కంపలు, పొదలు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోవడంతో గురువారం తొలగించినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రమోద్ తెలిపారు. డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులోని రహదారిన పిచ్చి మొక్కలను ట్రాక్టర్ బ్లేడ్ తో తొలగించారు. ఆ రహదారిన వెళ్లే వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శితో పాటు నాగేష్, విట్టల్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.