ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్, ఆర్మూర్ పట్టణ పరిధిలో మంగళవారం ఫుట్ పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు  తొలగించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఉత్తర్వుల ప్రకారం నిజామాబాదు ట్రాఫిక్ ఏసిపి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు దుకాణాల ముందు ఉన్న ఫుట్ పాత్  దుకాణాలను తొలగించారు. ఈ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయాలు కలగకుండా చేశారు. అంతేకాకుండా ఆర్మూర్ బస్టాండ్ ముందర కూడా అక్రమంగా ఆక్రమించిన ఫుట్ పాత్ లను  తొలగించారు.