Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 9:05 pm Posted by : ramakrishna

పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఒకరి రిమాండ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఒకరిని సోమవారం రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. చీలం గౌతం రెడ్డి అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడుపుతున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కానీ అతను పోలీసులకు సహకరించకుండా పోలీసులపై దాడి చేసి వారి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో గౌతంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ నిందితునికి జైలు శిక్ష విధించారు. దీంతో నిందితున్ని రిమాండ్ కు తరలించారు.