హైకోర్టులో రేవంత్ కు ఊరట
హైదరాబాద్, బతుకమ్మ : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. 2019 అక్టోబర్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈకేసును కొట్టివేయాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్ పై నమోదైన కేసును కొట్టి వేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.