మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట.

నిజామాబాద్, బతుకమ్మ: భూ వివాద కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు.. రంగారెడ్డి జిల్లా మోకిలా గ్రామంలోని 114 ఎకరాల భూమి కబ్జా ఆరోపణల నేపథ్యంలో భూ యజమాని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మోకిలా, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో జీవన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కేసులో నమోదు కావడంతో జీవన్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రత్యర్థులు ప్రచారం...