స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ముసాయిదా ఓటరు జాబితా విడుదల

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.ఎస్.ఆర్. ముసాయిదా ఓటరు జాబితా  ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే 28 నవంబరు 2024 లోగా సమర్పించవచ్చని, అట్టి వాటిని పరిశీలించి సంబంధిత...