Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 11:06 am Posted by : ramakrishna

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

వెబ్ న్యూస్,బతుకమ్మ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్  విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్ఈసీ రాణి కుముదిని వెల్లడించారు. 31 జిల్లాలలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  మెదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు.   అక్టోబర్ 9 వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత అక్టోబర్ 27 జరుగనుందన్నారు.  అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. 31 తొలి విడత పోలింగ్. అక్టోబర్ 21 నుంచి రెండో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు. నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ . మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు. నవంబర్ 8న పోలింగ్. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజలు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు, నవంబర్ 11 న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగుతుందని తెలిపారు.

Release of local election schedule