Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 5:47 pm Posted by : ramakrishna

తెయూ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : తెయూ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేశారు.  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ బి ఏ. బీకాం. బిఎస్సి. బి బి ఏ. కోర్సుల మూడవ,ఐదవ సెమిస్టర్( రెగ్యులర్),  రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ 2020 -23 బ్యాచ్ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్ కొరకు నవంబర్ 2024 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించు చివరి తేదీ 04-11-2024 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో తేదీ 05-11-2024 వరకు చెల్లించ గలరని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ పేర్కొన్నారు.