బీఎల్టీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఎల్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు బీఎల్టీయూ నాయకులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా పారిశుద్ధ్యం, వాటర్ సప్లై పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద ఈ దీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రిలే నిరాహారదీక్షల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.