పారిశుధ్య విభాగంలో రా‘బంధువులు’
. కార్పొరేషన్ లో కనిపించని కార్మికులు . విధులకు హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్న వైనం . ప్రజాప్రతినిధుల, గులాబీ లీడర్ల కుటుంబ సభ్యుల,అనుచరుల ఇష్టారాజ్యం . ప్రతి నెలా బల్దియాకు లక్షల రూపాయల భారం నిజామాబాద్ కార్పొరేషన్ పారిశుధ్య విభాగం ప్రజాప్రతినిధుల బంధువులకు అడ్డాగా మారింది. మేయర్ సోదరుడు.. సోదరుడి కొడుకు, బిడ్డతోపాటు ఆమె భర్త మేనల్లుడు, ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఆయన అనుచరుడి తమ్ముడు, మాజీ మేయర్ కొడుకు, సోదరుడుతోపాటు 10 మంది కుటుంబ సభ్యులు.. బీజేపీ కార్యకర్త ఒకరు, ఎన్నికల్లో కార్పొరేటర్...