- లోకల్ వర్సెస్ నాన్ లోకల్ డ్యూటీలు
- డిఈఓ కార్యాలయంలో తెరపైకి కాసుల పోస్టుల వివాదం
- సహయ నిరాకరణ పేరుతో అటెండెన్స్ పై సంతకాలకు ఉద్యోగుల నిరాకరణ
- ఉద్యోగుల ఒత్తిడి రెగ్యులర్ ఉద్యోగికి తాత్కాలికి సర్దుబాటు ఉత్తర్వులు
నిజామాబాద్, బతుకమ్మ : విద్యాశాఖలో రెండు రోజుల క్రితం ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రారంభమైంది. దాని ద్వారా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా స్కూల్ లో విధులకు హాజరై ఆన్ లైన్ లో హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ఈ విషయం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కొత్త చిచ్చు రేపింది. అందుకు కారణం డిఈఓ కార్యాలయంలో రెగ్యులర్ ఉద్యోగులు, డిప్యూటేషన్ ఉద్యోగుల మద్య పెత్తనం ఎవరిది అనే అంశం. ఎంఆర్ సి(మండల విద్యాశాఖాధికారి కార్యాలయం)లలో, పాఠశాలలో బోదనేతర విధులు నిర్వహిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. కాని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిప్యూటేషన్ పై ఉంటే కాసుల గల గల ఉంటుందనేది జగ మెరిగిన సత్యం. అక్కడ టెంపరరీ రిజస్ట్రేషన్ లు( ప్రైవేట్ స్కూల్స్ అనుమతులు), ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ లు( టిసిలు), కేజిబివిలు, మోడల్ స్కూల్ ల కార్యకలాపాలను పర్యవేక్షించే సెక్షన్ చూస్తే చాలు జీతంతో పాటు కాసులకు లోటు ఉండదు. ఇప్పుడు ఈ వ్యవహారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ముదుర్లు వర్సెస్ కొత్త వారుగా వివాదం నడుస్తుంది. రెగ్యూలర్ ఉద్యోగులు వర్సెస్ డిప్యూటేషన్ ఉద్యోగుల మధ్య వివాదం మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల టెంపరరీ పర్మిట్ లకు డీఓ కార్యాలయంలో సెక్షన్ అధికారులు రేట్లను అమాంతం పెంచేశారు. గతంలో టిఆర్ కు రూ.10 వేలు తీసుకునే వారు అంటా. కాని ఇటీవల రూ.35 వేలు ఇస్తేనే పర్మీషన్ ల పత్రాలు సంతకాలు జరిగి బయటకు వస్తున్నట్టు అంతా కోడై కూస్తోంది. ఇక ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్లు ( టిసీ) బుక్ లలోను కాసుల గలగల కొనసాగుతుంది. అవే కాకుండా కారుణ్య నియామకాలకు వారు నచ్చినంత అడిగిన డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ లు అనే చర్చ జరగుతుంది. అ విషయంలో డిప్యూటేషన్ లో వారికి, రెగ్యూలర్ ఉద్యోగులకు మధ్య కాసుల పోస్టుల విషయంలో పేచీ మొదలైంది. ప్రాధాన్యత కలిగిన సెక్షన్ పోస్టును డిఇఓ కార్యాలయంలో ఉద్యోగి ఒకరు తననుంచి ఇతరులకు కేటాయించకుండానే టిఆర్ లను తీసుకోవడం, దానిపై సంతకాలు కావడంపై వివాదం రాజుకుంది. అంతే గాకుండా డిఇఓ కార్యాలయం విషయాలు బహిర్గతం కావాడానికి ఇతర జిల్లానుంచి వచ్చిన ఉద్యోగి కారణం అని డిఇఓ కార్యాలయంలో సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. అంతే గాకుండా తనకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడంపై ఒక జూనియర్ అసిస్టెంట్ అప్పటి జిల్లా కలెక్టర్ కు పాత డిఇఓపై ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైందని తెలిసింది. సహాయ నిరాకరణ పేరుతో జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయంలోని డిఇఓ ఆపీస్ లో 35 మంది ఉద్యోగులు ఏవిధంగా అటెండేన్స్ పై సంతకాలు చేయలేదని చర్చ మొదలైంది.
డిఇఓ కార్యాలయంలో 7 గురు డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. వారు కాకుండా ఒక్కరిద్ధరు దశాబ్ధకాలంగా డిఇఓ కార్యాయం వీడటం లేదు. అంతే గాకుండా డిఇఓ కార్యాలయంకు సీనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు పొందిన వారు ఇప్పటికీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో పనిచేయడం అది కాక డిఇఓ కార్యాలయంలో డిప్యూటేషన్ పై చేయడం వివాదంగా మారింది. సర్వ శిక్షా అభియాన్ కు వచ్చిన వారు కుడా డిఇఒ కార్యాలయం కుర్చీలకు అతుక్కుపోయారు. ఇటీవల విద్యాశాఖలో కాసుల లొల్లి బహిర్గతమై కాకుండా, తప్పుడు ప్రొసీడింగ్ లు, సమాచారం బయటకు పొక్కడంతో ఇతర జిల్లానుంచి వచ్చిన ఉద్యోగికి సహాయ నిరాకరణ మొదలైంది. అప్రాధాన్యత పోస్టు ఇవ్వగా స్వీకరించాడానికి ససేమీరా అనడంతో రెండు రోజులుగా అటుండేన్స్ రిజిస్టర్ లపై సంతకాలు లేవని తెలిసింది. ఇటీవల ఈ వివాదం బోధనేతర సంఘం నాయకులు ద్వారా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లిన డిఇఓకు వివాదం సధ్ధు మనుచాలని పురమాయించినట్లు తెలిసింది. తాత్కాలికంగా గొడవల సర్ధుబాటు పేరుతో డిప్యూటేషన్ ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గి రెగ్యూలర్ ఉద్యోగిని జిల్లా కేంద్రంలోని ఒక స్కూల్ కు డిప్యూటేషన్ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. కాని వాటిని రెగ్యూలర్ ఉద్యోగి స్వీకరిస్తారా లేదా విధులలో జాయిన్ అవుతారా అనే సంశయం వ్యక్తం అవుతుంది. ఈ వివాదం ఎలా సద్దుమనుగుతుందో వేచి చూడాలి.
