Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 6:06 pm Posted by : ramakrishna

విద్యుత్ మీటర్లు లేని వారికి రెగ్యులర్ సర్వీసులు

బతుకమ్మ, కామారెడ్డి
విద్యుత్ మీటర్లు లేనివారికి విద్యుత్ శాఖ నుండి రెగ్యులర్ సర్వీసులు అందజేస్తామని కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తెలిపారు. కామారెడ్డి లోని రామేశ్వర్ పల్లి లో గల డబుల్ బెడ్ రూమ్ లో   ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ మీటర్ కోసం రూ.938 చెల్లిస్తే కొత్త మీటర్ ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డు ఉంటే ప్రజా పాలన లో జీరో బిల్లు కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి, కామారెడ్డి రూరల్ ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్, లైన్మెన్ అనిల్, ప్రజలు పాల్గొన్నారు.