Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 4:56 pm Posted by : ramakrishna

పీజీ పరీక్షలను పరిశీలించిన రిజిస్ట్రార్  

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీలో ఐదవ  రోజు జరుగుతున్న ఎం.ఏ, ఎం కాం, ఎం.ఎస్సీ, ఎంబీఏ, ఎల్.ఎల్.బి, ఇంటగ్రేటెడ్ పీజీ కోర్సుల రెండవ, నాల్గవ సెమిస్టర్  పరీక్షలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం.యాదగిరి  ఆకస్మిక తనిఖీ చేశారు.  ఉదయం జరిగిన పరీక్షకు  1867మంది విద్యార్థులకు గాను 1787 మంది విద్యార్థులు హాజరైనారు 80 మంది విద్యార్థులు గైరాజరైనారు.  మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్/ బి.పి ఎడ్  పరీక్షకు 1359 మంది విద్యార్థులకు గాను 1327 మంది విద్యార్థులు హాజరైనారని 32 మంది విద్యార్థులు గైరాజ రైనారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్  తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్  డా. ప్రవీణ్ మామిడాల, వైస్ ప్రిన్సిపాల్ డా. లక్ష్మణ్ చక్రవర్తి, అడిషనల్ కంట్రోలర్ బి సాయిలు డైరెక్టర్ ( పి ఆర్ ఓ )డా. పున్నయ్య  తదితరులున్నారు.