Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 5:01 pm Posted by : ramakrishna

సస్పెన్షన్‌ నుంచి రీఎంట్రీ

  •  బోధన్ కమిషనర్ కృష్ణ జాదవ్ మళ్లీ విధుల్లోకి

 

బతుకమ్మ, బోధన్ : ఆదిలాబాద్‌లో రెవెన్యూ అధికారిగా పనిచేసిన సమయంలో వచ్చిన ఆరోపణలతో ఇటీవల సస్పెన్షన్‌ ఎదుర్కొన్న బోధన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. విచారణలో ఆరోపణలు నిరాధారమని తేలడంతో ఉన్నతాధికారులు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరిన వెంటనే కమిషనర్ పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. శుభ్రతా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Reentry from suspension