వరి సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలి

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : రైతులు పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మాల్ తుమ్మెద ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి, రేవంత్ లు అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని పోచారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అవసరం మేరకే రసాయనాలను వినియోగించుకొని...