Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 3:57 pm Posted by : ramakrishna

రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం

  • అవార్డు దక్కడం అభినందనీయం
  • పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా రెడ్ క్రాస్ సేవలు అందరికీ చేరువై ప్రశంసలు అందుకుంటుందని పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ కు రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తోట రాజశేఖర్ ను ఘనంగా సన్మానించారు. జిల్లా రెడ్ క్రాస్ సేవలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు సహకారం రెడ్ క్రాస్ కు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ విద్యుత్ శాఖలో ఏడీఈ గా ఇటు విధుల్లోనూ అటు సేవా రంగంలోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ జిల్లా రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతపరిచి రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలుపాలని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సీహెచ్. రాంభూపాల్, నాయకులు రామ్మూర్తి గోపి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి కరిపి రవీందర్, జేఆర్సీ డా.అబ్బాపూర్, సభ్యులు ఎడ్ల నాగరాజ్,  దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Red Cross services are commendable.