Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 3:19 pm Posted by : ramakrishna

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్

హైదరాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మూడు రోజుల పాటు వడగాల్పులతో పాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి,  వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి మినహా మిగతా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రిపూట వాతావరణ పరిస్థితులు వేడిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.