Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:43 pm Posted by : ramakrishna

కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీ

 

. . . సోమవారం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

 

. . . ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్, కేంద్రీయ విద్యాలయం బోధన్ టౌన్‌లలో కాంట్రాక్ట్ ఆధారంగా ఉపాధ్యాయుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు 9 మార్చి 2026 (సోమవారం) నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్ ప్రాంగణంలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), టీజీటీ (ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఏటీఎల్ ఇన్‌స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సీటీఈటీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 9.00 గంటల నుంచి ఒరిజినల్ విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు పాఠశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.