నాలుగు ఫోన్ ల రికవరీ

భిక్కనూర్, బతుకమ్మ: నాలుగు సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ తెలిపారు. సీ ఈ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం స్టేషన్ లో అందజేశారు. ఫోన్ లు రికవరీ చేసిన ఎస్సైకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.