130 సెల్ ఫోన్ల రికవరీ
కామారెడ్డి, బతుకమ్మ : పోగొట్టుకున్న 130 సెల్ ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 130 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిని బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే అది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు....