తిరుపతి, బతుకమ్మ: తిరుమలలో లడ్డూ ప్రసాదాలను గతేడాది రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో పదిశాతం అదనంగా భక్తులకు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా 2025లో ఆసంఖ్య 13.52 కోట్లకు చేరాయి. డిసెంబర్ 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని టీటీడీ వెల్లడించింది. ఏడాదిగా ప్రతి రోజూ 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తున్నారు.