- ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తి
- ఈ సీజన్ లో కొత్త రికార్డులు ఖాయం
మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రధాయని శ్రీరాం సాగర్ నీటి విడుదల కొత్త రికార్డులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. వర్షకాలం ముగిసిన ప్రస్తుతం గేట్లను ఎత్తి నీటిని వదలడంలో కొత్త గణాంకాలు లిఖిస్తుండగా, తాజాగా కరెంటు ఉత్పత్తిలో లక్ష్యంను చేరుకుంది. సోమవారం వరకు 2025-26 సంవత్సరానికి సంబంధించిన 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పోచంపాడ్ జెన్ కోలో ఉత్పత్తి అయింది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తయింద ని జెన్ కో డి ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ సంవత్సరం లక్ష్యం 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఇప్పటివరకు 67.42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా కురవడం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల ముందు గాని లక్ష్యానికి ఇది ఉత్పత్తి చేరుకుందని తెలియజేశారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు సిబ్బంది సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు.. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు జూన్ 1 నుంచి సోమవారం వరకు 918.07 టియంసీల వరద వచ్చి చేరింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువకు 850.363 టీయంసీల నీరు దిగువకు వదిలారు. ఎస్కేప్ గేట్ల ద్వారా జరుగుతున్న నీటి విడుదల నేపథ్యంలో ప్రాజెక్టు జెన్ కో అధికారులు నీటి ప్రవాహం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నీరు గోదావరిలోకి వదలడం వలన ప్రయోజనం మాత్రం విద్యుత్ ఉత్పత్తి మాత్రం దండిగా జరిగిందని చెప్పాలి.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు విద్యుత్ ను ఉత్పత్తి చేయు టర్బైన్లు ఉన్నాయి. ఒక్కొక్క టర్బైన్ ద్వారా 9 మెగావాట్ల చొప్పున 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుత సంవత్సరం సామర్థ్యానికి మించి 36.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి వరకు జరిగింది. ప్రాజెక్ట్ నీటిమట్టం నిండుకుండలా ఉండడంతో పాటు నీరు వేగంగా రావడం, గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల ద్వారా సామర్థ్యానికి మించి విద్యుత్ ప్రత్తి సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. రోజుకు 0.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. నెలకు 1.7521 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగితే, ఇప్పటి వరకు 68.3023 మిలియన్ యూనిట్ల విద్యుత్ లక్ష్యం పూర్తయింది. ఈ సీజన్ లో 0.003713 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సంవత్సరాలు. మి. యూ
2020-21. 90.7656
2021-22. 109.8417
2022-23. 138.9207
2023-24. 75.8692
2024-25. 66.7381
2025-26. 67.4236 (ఆదివారం వరకు)