తిరుమల, బతుకమ్మ : జూన్ నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతే ఏడాదితో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగింది. జూన్ లో 24.08 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. జూన్ లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.35 కోట్లు వచ్చింది. జూన్ 14వ తేదీన అత్యధికంగా 91,000 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం.