- మన క్యాస్ట్ వారై ఉండాలి
- సొసైటీల ఉద్యోగులను వదిలి బ్యాంక్ ఉద్యోగులపై పాలకవర్గం పెత్తనం
- బ్యాంక్ ఉద్యోగుల బదిలీలపై కొర్రీలు పెడుతున్న వైనం
- బదిలీల పై చేతులేత్తేసిని బ్యాంక్ సీఈఓ
99865నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తో పాటు అనుబంధ బ్రాంచ్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు తమను బదిలీ చేయండి మొర్రో అని నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఐనా బ్యాంక్ అధికారులు కరుణించడం లేదు. బ్యాంక్ ఉద్యోగుల బదిలీ నిబంధనల ప్రకారం బ్యాంక్ సిఈఓ ఆధ్వర్యంలో జరగాలి. మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలి. బదిలీ సందర్భంగా వారిని ఆప్షన్ అడిగి కౌన్సిలింగ్ ద్వారా స్థాన చలనం చేయాలి. కాని జిల్లా బ్యాంక్ అధికారులు బదిలీల వ్యవహరం పాలకవర్గంపై నెట్టేసి తప్పించుకుంటుండగా వారు ఇదే అవకాశంగా బదిలీలలో అస్మదీయులకు ఒకవిధంగా, తమ సామాజిక వర్గం వారికి ఒక విధంగా వ్యవహరిస్తున్నారు. పైరవీలకు ఒకవిధంగా తమకు నచ్చిన వారికి మరోవిధంగా బదిలీలు చేస్తున్నారు.
బదిలీల విషయంలో బ్యాంకు అధికారులు చేతులెత్తేయగా బ్యాంక్ పాలకవర్గం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఒక బ్యాంక్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. మద్నూర్ బ్యాంక్ క్యాషియర్ శేఖర్ రోడ్డు ప్రమాద బారిన పడ్డాడు. బిర్కూర్ మేనేజర్ రవీందర్ రోడ్డు ప్రమాద బాధితుడయ్యాడు. వారంతా రికమండ్ చేయలేక పాలకవర్గం శరణు కోరిన తమవారు కాదని సామాజిక వర్గం కాదన్న వారిని అక్కడే కొనసాగించడం గమనార్హం. నిజామాబాద్ డిచ్ పల్లి మధ్యలో ఒక ఉద్యోగి దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాడు. బాన్సువాడ, బిర్కూర్ మధ్య మరో ఉద్యోగి అదే రీతిన విధి నిర్వహణ చేస్తున్నాడు. పాలకవర్గానికి సంబంధించిన లేదా పొలిటికల్ లీడర్ ల బంధువులైతే ఒకవిధంగా సామాజిక పరంగా అట్టడుగున ఉన్నవారికి మరోవిధంగా విధి నిర్వహణ కేటాయిస్తున్నారు. ఇటీవల బ్యాంక్ ఉద్యోగి ఒకరు తమ యూనియన్ పరిధిలో బదిలీల గురించి పాలకవర్గం పెరేత్తినందుకే ఫోకాస్ నోటిసులు ఇచ్చి సంజాయిషీ కోరడం బ్యాంక్ పాలకవర్గానికే చెల్లింది. ఉమ్మడి జిల్లాలో డి.సి.సి.బి. బ్యాంక్ పరిధిలో 63 బ్రాంచులు ఉన్నాయి. అందులో మేనేజర్ లు, క్యాషియర్ లు, అసిస్టెంట్ మేనేజర్ లు దాదాపు 350 పై చిలుకుగా బదిలీల కోసం ఎదురుచుస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. యూనియన్ నాయకులూ కూడా పాలకవర్గం అడుగులకు మడుగులోత్తుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
బ్యాంక్ పాలకవర్గం పరిధిలో 144 సొసైటీలలో అవినీతి అక్రమాలకూ కేరాఫ్ అడ్రస్ గా నిలిచినా సొసైటీల వైపు నెలల తరబడి కన్నెత్తి చూడకబోయిన సి.ఈ.ఒ. లను (సొసైటీ కార్యదర్శులను) పాలకవర్గం కన్నెత్తి చూడకపోవడం విశేషం. జిల్లాలో సొసైటీలలో కార్యదర్శులు 20 ఏళ్లకు పైబడి పాతుకుపోయారు. లక్షల్లో అవినీతికి పాల్పడిన కేసులు నమోదైన రికవరీ లేదు.. చర్యలు లేవు. బ్యాంక్ పాలకవర్గం తీరువల్ల సొసైటీలలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది 20 ఏళ్లుగా బదిలీలు లేక పదోన్నతులు లేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో పేరెన్నికకల్గిన సొసైటీలుగా ఉమ్మడి రాష్ట్రంలో వెలుగొందినవి ప్రస్తుతం అవినీతి అక్రమాలకు అడ్డగా మారాయి. వాటిపై ఏకంగా జిల్లా సహకార శాఖ, విజిలెన్స్ ఇతర శాఖల అద్వర్యంలో విచారణ జరిగినా అవి బుట్టదాఖలయ్యాయి. జిల్లాలో రైతులను కడ్తా పేరిట ధాన్యం తూకంలో కోతలు కోసి వాటాలు పంచుకుంటారని ఆరోపణలు కోకొల్లలు. సొసైటీల పరిధిలో ఎరువులను అమ్ముకొని రోడ్డున పడ్డవి చాలానే ఉన్నాయి. కాని నిజామాబాద్ పాలకవర్గం డి.సి.సి.బి. బ్యాంక్ పై దాని ఉద్యోగులపై చూపిన ఆసక్తి సొసైటీ ఉద్యోగులపై చూపకపోవడం వివక్షతకు నిదర్శనంగా చెప్పాలి.