అక్రమ కేసులపై యువతకు  భరోసా

బిచ్కుంద, బతుకమ్మ :  బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్ మరియు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు యువతను బెదిరించడం ప్రజాస్వామ్యానికి పనికిరాని విధానం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ సింధే , బాధిత యువకులను   కలిసి వారికి  ధైర్యం చెప్పారు. ప్రజల కోసం గొంతు వినిపించడం...