అభయ హస్తం కాలనీపై రియాల్టర్ల కన్ను
పేదల గుడిసెలకు అభయ హస్తం అందించేదెవరు..? రియాల్టర్ల వెనకున్న అభయహస్తం ఎవరిది..? పేదలు గుడిసెలు వేసిన స్థలం కబ్జాకు యత్నాలు నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ శివారులో సర్కార్ భూమిపై రియాల్టర్ల కన్ను పడింది. చెంతనే కలెక్టరేట్ ఉండడం, బైపాస్ కు సమీపంలో ఉండడంతో సంబంధిత భూమిని చెరబట్టేందుకు సిద్దమయ్యారు. 2018 నుంచి పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని కబ్జాకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగర శివారులోని సర్వే నంబర్ 171,172లో నాలుగు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది....