- ఏఎంసీ చైర్మన్ నర్సయ్య
భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రజా పాలనలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద ఇంటి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తోందని కమ్మర్ పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య అన్నారు. సోమవారం మండలంలోని ముచ్కూర్, లింగపూర్ లలో నిర్మాణం పూర్తి అయ్యి గృహ ప్రవేశం చేస్తున్న లబ్దిదారుల ఇండ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఈ పథకం తో చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొంటున్న లబ్దిదారులు వేగంగా పనులను పూర్తి చేసుకోవాలని అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశ చేసిన లబ్దిదారులు ఆయన శుభాకాంక్షలు తెలిపి, ఇండ్ల మంజూరు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సంతోష్ కుమార్, మాజీ ఎంపిపి కన్నె సురేందర్, ఈజీ ఎస్ ఏ పీ ఓ నర్సయ్య, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
