Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 6:31 pm Posted by : ramakrishna

స్థానిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధం

  • జుక్కల్ యువజన కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  దిశానిర్దేశం

 

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గం క్యాంప్ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనలు అందించారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన నియోజకవర్గ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, జిల్లాస్థాయి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం స్పష్టమైన వ్యూహం అవసరమని, ప్రతి నాయకుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలం పెంచేలా పనిచేయాలని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కలిసి పనిచేస్తే మెజారిటీ స్థానాలు గెలవడం ఖాయం అని దిశానిర్దేశం చేశారు. జుక్కల్ లో కాంగ్రెస్ విజయం కోసం యువత ఒకే తాటిపై కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.