Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 7:25 pm Posted by : ramakrishna

దొనకల్ పాఠశాలలో పఠనోత్సవం ప్రారంభం

మోర్తాడ్, బతుకమ్మ: విద్యార్థుల్లో పట్టణ శక్తి, పట్టణ సాంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమావేశ శిక్ష ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా దొనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పఠణోత్సవ కార్యక్రమం ప్రారంభించినట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రతినిత్యం చదవడం కోసం అరగంట సమయం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలే కాకుండా వార్తాపత్రికలు, కథల పుస్తకాలు, మ్యాగ్జిన్స్ తదితర పుస్తకాలు చదివించడం జరుగుతుందని తెలియజేశారు. పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు, పెరగడం జరుగుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Reading festival begins at Donakal School