Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:56 pm Posted by : ramakrishna

ఉన్నత లక్ష్యం తో చదవాలి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ప్రతి విద్యార్థి జీవితంలో స్థిర పడటానికి ప్రారంభం నుంచి ఉన్నత లక్ష్యం తో చదవాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి  విద్యార్థులకు కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఎగ్జామ్ పాడ్స్, పెన్నుల పంపిణి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయం అని తెలిపారు. కార్యక్రమం లో మండల నాయకులు, గురిజాల నర్సారెడ్డి, వార్డ్ సభ్యులు పాలేపు సాయన్న, బడే నరేందర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Read with a high aim.