Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 8:21 pm Posted by : ramakrishna

రోజువారి లక్ష్యాన్ని చేరుకోవాలి

  • మున్సిపల్ కమిషనర్ 

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఆస్తి పన్ను వసూళ్లలో రోజువారి లక్ష్యాన్ని చేరుకోవాలని మున్సిపల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. 5% (EBI) ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ ఆస్తి పన్ను వసూళ్లపై రిబేట్ పై సమీక్షా సమావేశం బుధవారం మున్సిపల్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లను వార్డు వారీగా నగదు వసూళ్ల నివేదికలతో రోజువారీ మెషిన్ స్లిప్ లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమ ప్రణాళిక ప్రకారం రోజువారీ వసూళ్లను పెంచాలని, రోజువారీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

Reach your daily goal