బతుకమ్మ, బోధన్: సాలూరా మండలం ఫతేపూర్ గ్రామంలో మహాలక్ష్మి పోచమ్మ విగ్రహ పున ప్రతిష్టాపనతో పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పోలీస్ పటేల్ శ్యాంసుందర్ మల్లికార్జున్ బాసరే, మార్కెట్ కమిటీ చైర్మన్ దంపతులు చీల శంకర్–లావణ్య, సాలూర పోలీస్ పటేల్ వెంకట్ పటేల్, గంగాధర్ శంకర్ దత్తాత్రి తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.