ఎస్సారెస్పీ -2 కి ఆర్డీఆర్ పేరు : సీఎం రేవంత్

నల్గొండ, బతుకమ్మ : ఎస్సారెస్పీ -2 కి ఆర్డీఆర్ (మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ) అని నామకరణం చేస్తామని సీఎం రేవంత రెడ్డి  అన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 24గంటల్లో  తెస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో  ఆదివారం రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని పేర్కొన్నారు. దామన్న కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామన్నారు. దామన్న మృతిపై సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారని పేర్కొన్నారు.