విద్యార్థులకు ఆర్డీఓ పరామర్శ
ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను గురువారం ఆర్డీవో ప్రభాకర్ పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రవీంద్ర మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. భోజనం పడకపోవడం వల్ల వాంతులై ఉంటాయని, అందరూ కోలుకుంటున్నారని వారిని త్వరలోనే డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యుడు తెలిపారు.